: ఆ 10 వేల కోట్లు జగన్ వి కావు... చంద్రబాబు బినామీవీ కావు!
స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం ద్వారా నల్లధన వివరాలను ప్రకటించి... విడతల వారీగా ట్యాక్స్ లు చెల్లించి, ఆ మొత్తాన్ని వైట్ మనీగా మార్చుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత... దేశ వ్యాప్తంగా మొత్తం 65 వేల కోట్ల నల్లధనం బయటపడిన సంగతి తెలిసిందే. అయితే, హైదరాబాద్ నుంచి ఓ వ్యక్తి ఏకంగా రూ. 10 వేల కోట్ల నల్లధనాన్ని డిక్లేర్ చేశాడంటూ వార్తలు రావడంతో... అందరూ అవాక్కయ్యారు. ఈ విషయం రాజకీయ రంగు కూడా పులుముకుంది. లక్ష కోట్లు సంపాదించిన వైసీపీ అధినేత జగన్ దే ఈ నల్లధనం అంటూ టీడీపీ నేతలు విమర్శల వర్షం కురిపించారు. మరోవైపు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బినామీనే ఈ బ్లాక్ మనీని డిక్లేర్ చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో అసలు విషయం వెలుగు చూసింది. హైదరాబాద్ ఫిలింనగర్లో నివాసం ఉండే లక్ష్మణ్ రావు అనే వ్యక్తి ఈ రూ. 10వేల కోట్ల నల్ల ధనాన్ని ప్రకటించాడని తెలిసింది. అయితే, లక్ష్మణ్ రావు వద్ద ఏమీ లేదని తేలడంతో... ఐటీ అధికారులు అవాక్కయ్యారు.