: బ్యాంకులు, ఏటీఎంల ముందు 80 మంది మృతి చెందారు, ఆ బాధ్యత ఎవరిది?: గులాం నబీ ఆజాద్
రాజ్యసభలో పెద్దనోట్ల రద్దుపై చర్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పెద్దనోట్ల రద్దు తరువాత జరిగిన పరిణామాలపై ఎవరు బాధ్యత తీసుకుంటారని ఆయన అడిగారు. బ్యాంకులు, ఏటీఎంల ముందు ఇప్పటివరకు క్యూలైన్లలో 80 మంది మృతి చెందారని ఆయన అన్నారు. పెళ్లిళ్లకోసం డబ్బులు అడిగితే బ్యాంకులు ఇవ్వలేమని చెప్పేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతో మంది ఉపాధి కూడా కోల్పోయారని చెప్పారు. నోట్ల రద్దు పరిణామాలపై ప్రభుత్వం స్పందించాలని గులాం నబీ ఆజాద్ అన్నారు. సమగ్ర చర్యలు తీసుకోకుండానే పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దేశ ప్రజలందరినీ క్యూలైన్లలో ఎందుకు నిలబెడుతున్నారని ప్రశ్నించారు. ప్రజలంతా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.