: లోక్‌సభకు హాజరైన ప్రధాని మోదీ... విపక్ష సభ్యుల ఆందోళన, నినాదాలు
పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ మాజీ సభ్యుడు, తుగ్లక్ పత్రిక సంపాదకుడు చో రామస్వామి మృతి పట్ల రాజ్యసభలో సంతాపం తెలిపారు. పెద్దనోట్ల రద్దుపై లోక్‌సభలో విపక్ష సభ్యులు నినాదాలు చేస్తున్నారు. లోక్‌సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం సరికాదంటూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. గందరగోళం మధ్యే సభ కొనసాగుతోంది. పెద్దనోట్ల రద్దు తరువాత ప్రజల కష్టాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ కూడా ప్రకటించలేదని విపక్షనేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.