: ఐఎస్ అంతం చూసిన సంకీర్ణ సేనలు... లిబియాలో సంబరాలు
క్రూరత్వానికి, దురాగతాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ లిబియా దేశంలో తుడిచిపెట్టుకు పోయింది. అమెరికా సేనల సహాయంతో లిబియా బలగాలు జరిపిన దాడులతో ఐఎస్ ఉగ్రవాదులు చేతులెత్తేశారు. సిర్టీలోని చివరి ఐఎస్ బేస్ క్యాంప్ పై... సంకీర్ణ సేనలు జరిపిన వైమానిక దాడుల్లో ఐఎస్ బంకర్లు, నివాసాలు ధ్వంసమయ్యాయి. దీంతో, భారీ ఎత్తున ముష్కరమూకలు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటపడ్డవారు బతుకుజీవుడా అనుకుంటూ పరారయ్యారు. ఈ క్రమంలో సిర్టీ, గిజి బరియా జిల్లాలపై సైన్యం పూర్తి పట్టు సాధించినట్టయింది. ఈ విజయంతో లిబియా, అమెరికా సేనల్లో ఆనందం వెల్లివిరిసింది. దీంతో, వారంతా సంబరాల్లో మునిగిపోయారు. ఈ దాడులతో, లిబియాలో ఐఎస్ కు ఒక్క స్థావరం కూడా లేకుండా పోయింది.