: మరో గంటలో నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ఎల్‌వీ
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ ఉదయం 10:25 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి36ను నింగిలోకి పంపించేందుకు సర్వం సిద్ధమైంది. సోమవారం రాత్రి 10:25 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ నిరంతరాయంగా కొనసాగుతోంది. రిసోర్స్‌శాట్-2ఎ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్‌వీ లాంచ్ వెహికల్ నింగిలోకి మోసుకెళ్లనుంది. వ్యవసాయానికి సంబంధించిన వివరాలను రీసోర్స్ శాట్-2ఎ అందిస్తుందని ఇస్రో అధికారులు తెలిపారు. ప్రయోగాన్ని పర్యవేక్షించేందుకు ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ మంగళవారం ఉదయమే షార్‌కు చేరుకున్నారు.