: ఆర్మీ అధికారిక వాహనాల్లో మార్పు.. మారుతి జిప్సీకి బై!
ఎంతో కాలంగా ఆర్మీ అధికారిక వాహనాలుగా ఉపయోగిస్తున్న, పెట్రోలుతో నడిచే మారుతి జిప్సీకి స్వస్తి చెప్పనున్నట్లు సమాచారం. ఈ వాహనాల స్థానే టాటా సఫారీ స్ట్రామ్ కు చెందిన వాహనాలు ఇకపై ఆర్మీ అధికారిక వాహనాలు కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్మీ అధికారులు సదరు సంస్థకు 3198 వాహనాల కోసం ఆర్డరు చేసినట్లు తెలుస్తోంది. అదనపు సెక్యురిటీ ఫీచర్లతో ఉండే స్పోర్ట్స్ యుటిలిటీ వెహిక్సల్ (ఎస్ యూవీ) వాహనాలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశ్యంతోనే డీజిల్ తో నడిచే ఈ వాహనాలకు ఆర్డరు చేశారని సమాచారం. ఇందుకు సంబంధించి భారత సైన్యం అధికారిక ప్రకటన త్వరలో చేయనుంది. కాగా, ఈ డీల్ ను దక్కించుకునే విషయమై మహీంద్రా కంపెనీ నుంచి ‘టాటా మోటార్స్’ కు గట్టిపోటీ ఎదురైనట్లు తెలుస్తోంది.