: రాజాజీహాల్‌ వద్ద జయలలితకు నివాళులర్పించిన మన్మోహన్ సింగ్, పలు రాష్ట్రాల సీఎంలు


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కడసారి చూడడానికి రాజాజీహాల్‌ వద్దకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేరుకుంటున్నారు. ఇప్ప‌టికే ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయ‌డు, క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామయ్య జ‌య‌ల‌లిత పార్థివ‌దేహాన్ని సంద‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌, ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ కూడా అక్క‌డ‌కు చేరుకొని జ‌య‌ల‌లిత‌కు నివాళుల‌ర్పించారు. డీఎంకే నేత స్టాలిన్ కూడా జ‌య‌ల‌లిత పార్థివదేహాన్ని సంద‌ర్శించుకున్నారు. మ‌రోవైపు మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ జయలలితకు నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News