: అమెరికా వీసా సమస్యలా?... మీకోసం 15 రోజులకోసారి ఓపెన్ హౌస్


వీసా, పాస్‌ పోర్ట్, ఓసీఐ (ఓవర్‌ సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా) కార్డు సమస్యలను పరిష్కరించేందుకు జనవరి నుంచి ఓపెన్ హౌస్ నిర్వహించనున్నామని అమెరికాలోని భారత రాయబార కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ‘భారత కాన్సులేట్ తో పాటు మరో ఐదు రాయబార కార్యాలయాల్లో ఓపెన్ హౌస్ నిర్వహించడం ద్వారా సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తామని భారత రాయబారి నవతేజ్ సర్ణ తెలిపారు. అమెరికాలో భారత ఉప రాయబారిగా ఉన్న తరణ్‌ జిత్ సింగ్ సంధు శ్రీలంకకు భారత హైకమిషనర్‌ గా బదిలీ అయిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వర్ణ ప్రసంగించారు. హౌస్ నిర్వహించే తేదీ, సమయాన్ని ముందుగానే వెబ్‌ సైట్‌ లో ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలను పటిష్ఠం చేసే దిశగా ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ పాత్ర అభినందనీయమని అన్నారు.

  • Loading...

More Telugu News