: జయలలిత కోసం తపస్సే చేశాను... ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పిన శోభన్ బాబు
జయలలితతో నటించినది కొన్ని చిత్రాలే అయినా, హీరో శోభన్ బాబుతో ఆమెకున్న అనుబంధం ప్రత్యేకమైనది. ఈ విషయాన్ని గతంలో శోభన్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను నటుడిగా అవకాశాలు పొందే నాటికే జయలలిత పెద్ద స్టార్ అని, ఆమెతో నటించాలని ఎనిమిదేళ్లు ఎదురుచూశానని చెప్పుకున్నారు. ఆమెను చూడాలని తపించే వాడినని, ఓ రకంగా తపస్సే చేశానని గుర్తు చేసుకున్నారు. 1973లో తల్లిని కోల్పోయి, విషాదంలో ఉన్న జయలలితను తొలిసారిగా కలిశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన శోభన్ బాబు, ఆమెను మామూలుగా చేసేందుకు హుషారుగా జోక్స్ వేస్తూ నవ్వించేవారట. ఆ ప్రవర్తనే జయకు ఆయన్ను దగ్గర చేసింది. అమ్మ చనిపోవడంతో నా అన్నవారు లేక, బతుకుపై విరక్తిని పెంచుకుంటున్న దశలో, శోభన్ బాబుతో స్నేహం కొత్త ఆశలు చిగురించేలా చేసింది. ఈ విషయాన్ని జయలలిత తనతో చాలా సార్లు చెప్పిందని శోభన్ బాబు వెల్లడించారు.