: అల్లు అరవింద్ సోదరి కన్నుమూత
అల్లు రామలింగయ్య పెద్ద కుమార్తె అల్లు భారతి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో ఈరోజు మృతి చెందారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు, ప్రముఖ నటుడు చిరంజీవి భార్య సురేఖకు ఆమె సోదరి. అవివాహిత అయిన ఆమె, అల్లు అరవింద్ కుటుంబంతోనే కలిసి నివసించేవారు. కాగా, హైదరాబాద్ శివారులోని కోకాపేటలోని ‘అల్లు’ ఫాంహౌస్ లో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.