: సంవ‌త్స‌రం క్రితం తండ్రిని చంపాడు.. ఇప్పుడు త‌ల్లిని చంపాడు!


వికారాబాద్‌ జిల్లా గంగారంలో దారుణ ఘటన జరిగింది. అంజమ్మ (45) అనే ఓ మ‌హిళ‌ను ఆమె కుమారుడు వెంకటేశ్ క‌డ‌తేర్చాడు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో బ‌య‌టినుంచి వ‌చ్చిన వెంక‌టేశ్ త‌న త‌ల్లిని అన్నం పెట్ట‌మ‌ని అడిగాడు. అయితే, అంజమ్మ అందుకు నిరాక‌రించి అతడినే వడ్డించుకుని తినాలని చెప్పింది. దీంతో కోపంతో ఊగిపోయిన వెంకటేశ్ ఆమె గొంతు పిసికి హ‌త్య‌చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అంజ‌మ్మ ఇంటికి చేరుకొని వెంక‌టేశ్‌ను అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన వెంక‌టేశ్ సోద‌రి మాట్లాడుతూ... గత ఏడాది త‌మ‌ తండ్రిని కూడా వెంక‌టేశ్‌ ఇలాగే చంపేశాడని పోలీసులకు తెలిపింది.

  • Loading...

More Telugu News