: వెల్డన్ గర్ల్స్..పాకిస్థాన్ కు అవకాశం కూడా ఇవ్వలేదు: సెహ్వాగ్ ప్రశంసలు
ఆసియాకప్ ఫైనల్లో పాకిస్థాన్ జట్టుపై విజయదుందుభి మోగించిన భారత మహిళా క్రికెట్ జట్టును టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభినందించాడు. పాకిస్థాన్ పై అద్భుతమైన విజయం సాధించి, టోర్నీ గెలుచుకోవడం పట్ల ఆనందంగా ఉందని చెప్పాడు. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా విజయం సాధించడం అద్వితీయమని పేర్కొన్నాడు. కాగా, పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టుపై 17 పరుగులతో భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ సాధించిన మహిళా జట్టుగా భారత మహిళా జట్టు ఆవిర్భవించింది. టోర్నీ ఆద్యంతం హైదరాబాదు అమ్మాయి మిథాలీ రాజ్ రాణించింది. దీంతో ఫైనల్లో 'ఉమన్ ఆఫ్ ది మ్యాచ్' తోపాటు 'ఉమన్ ఆఫ్ ది సిరీస్' కూడా ఆమెకే దక్కింది.