: గల్లీ క్రికెట్ ఆడిన గంగూలీ.. ఎంజాయ్ చేసిన పిల్లలు!


టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గల్లీ క్రికెటర్ అవతారమెత్తాడు. క్రికెట్ కు గల్లీ క్రికెట్ తో విడదీయరాని అనుబంధం ఉంటుంది. క్రికెటర్ గా రూపాంతరం చెందే ప్రతివ్యక్తి తొలుత ఆడేది గల్లీ క్రికెట్టే. అలాంటి గల్లీ క్రికెట్ ను గుర్తుచేసుకున్న గంగూలీ కోల్ కతాలోని ఓ వీధిలో పిల్లలతో గల్లీ క్రికెట్ ఆడాడు. లెఫ్ట్ హ్యాండర్ అయిన గంగూలీ, కుడి చేత్తో కూడా బ్యాటింగ్ చేసి అక్కడి పిల్లలను అలరించాడు. ఈ సందర్భంగా బౌన్సర్లు, గుడ్ లెంగ్త్, అవుట్ స్వింగర్లు, ఇన్ స్వింగర్లు వేయించుకుని మరీ షాట్లు ఆడి, దూసుకువచ్చే బంతులను ఎలా ఆడాలో చూపించాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి, వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా మారిన గంగూలీ మళ్లీ పాతతరహా ఆటతీరు ప్రదర్శించడం అక్కడి వారిని ఆకట్టుకుంది. కాగా, గల్లీ క్రికెట్ లో బ్యాట్ ను స్వేచ్ఛగా విసిరేందుకు గంగూలీ ఇబ్బంది పడడం విశేషం. మీరు కూడా ఆ వీడియోను చూడండి.

  • Loading...

More Telugu News