: రైలు ఢీ కొనడంతో మృత్యువాత పడ్డ మూడు ఏనుగులు
పట్టాలు దాటుతున్న ఏనుగులను వేగంగా వస్తోన్న ఓ రైలు ఢీకొనడంతో అవి అక్కడికక్కడే మృత్యు వాత పడ్డ దారుణ ఘటన అసోంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మూడు ఏనుగులు మృతి చెందాయని, వాటిలో రెండు ఏనుగులు గర్భంతో ఉన్నాయని అక్కడి అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ ఏనుగులను కన్యాకుమారి-దిబ్రూగఢ్ వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టినట్లు పేర్కొన్నారు. రైలు ఢీకొట్టడంతో ఏనుగులు చెల్లా చెదురుగా పడ్డాయని, గర్భంతో ఉన్న ఏనుగుల కళేబరాలకు పోస్టు మార్టం చేసి రెండు నెలల, నాలుగు నెలల పిండాలను తొలగించినట్లు వారు తెలిపారు.