: ఢిల్లీ నుంచి హుటాహుటిన చెన్నయ్ కు బయలుదేరిన అన్నాడీఎంకే ఎంపీలు
చెన్నయ్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స తీసుకుంటున్న జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఆ ఆసుపత్రి వైద్యులు ప్రకటించిన వెంటనే ఢిల్లీ నుంచి హుటాహుటిన అన్నాడీఎంకే ఎంపీలు చెన్నయ్కి బయలుదేరారు. అన్నాడీఎంకేకు చెందిన సుమారు 30 మంది ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు పార్లమెంటుకు వచ్చారు. అయితే, ఆసుపత్రి నుంచి ప్రకటన విడుదల కాగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై కూడా ఈ రోజు పార్లమెంటులో తన ఆఫీసుకు గైర్హాజరయ్యారు.