: జయలలిత అసలు బతికున్నారా? లేదా?: నిజం చెప్పాలంటూ ఎంపీ శశికళా పుష్ప డిమాండ్
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వర్గాలు వాస్తవాన్ని చెప్పాలని ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఎంపీ శశికళా పుష్ప డిమాండ్ చేశారు. ఆమె అసలు బతికున్నారా? లేదా? చెప్పాలని కోరిన ఆమె, ప్రజలకు నిజం చెప్పాలని అన్నారు. ఆమె ఆరోగ్యంపై వదంతులు వస్తున్నాయని, వీటిని నిలిపి, తమిళనాట ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె విన్నవించారు. రెండున్నర నెలలుగా ఆసుపత్రిలో ఉన్న ఆమె, పూర్తిగా కోలుకున్నారని ప్రకటన వచ్చిన గంటల వ్యవధిలోనే గుండెపోటు రావడంపై అనుమానాలు నివృత్తి చేయాలని శశికళ కోరారు.