: ప్రజల డబ్బు ప్రజలకే ఇవ్వాలంటూ రాజ్యసభలో నినాదాలు
ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పార్లమెంటు ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. పెద్దనోట్ల రద్దుపై విపక్ష సభ్యులు తమ పట్టుని విడవడం లేదు. పెద్దనోట్ల రద్దు అనంతరం సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి వద్ద ఉన్న డబ్బంతా బ్యాంకుల్లో వేశారని రాజ్యసభలో విపక్ష సభ్యులు అన్నారు. బ్యాంకుల నుంచి మళ్లీ డబ్బు తీసుకోవాలంటే ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయని, వారి డబ్బు వారికి ఇచ్చేయాలని విపక్ష నేతలు ఛైర్మన్ పోడియం వద్దకు దూసుకువెళ్లారు. దీంతో గందరగోళం నెలకొనడంతో సభను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు. మరోవైపు పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఎంసీ నేతలు ఈ రోజు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.