: సాయంత్రం అత్యవసర సమావేశం... ఎమ్మెల్యేలంతా చెన్నై రావాలి: ఏఐఏడీఎంకే ఆదేశాలు


తమిళనాడులోని అన్నా డీఎంకే శాసన సభ్యులంతా సాయంత్రంలోగా చెన్నైలో ఉండాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ప్రతి ఎమ్మెల్యేకూ ఫోన్, ఫ్యాక్స్ లు వెళ్లినట్టు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. నేటి సాయంత్రం పార్టీ శాసన సభా పక్షం అత్యవసర సమావేశం జరగనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై కొన్ని గంటలు గడిస్తేగాని ఏ విషయం చెప్పలేమని వైద్యులు చెబుతుండటం, సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ రానుండటం, ఎమ్మెల్యేలందరూ అందుబాటులో ఉండాలని పార్టీ ఆదేశించడం... ఇవన్నీ పరిశీలిస్తే జరగకూడనిది ఏదో జరుగుతుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం అపోలో ఆసుపత్రికి అన్ని వైపులా రెండున్నర కిలోమీటర్ల దూరం వరకూ ఎవరినీ అనుమతించడం లేదు. మరోవైపు కేంద్ర బలగాలను అన్ని జిల్లాలకు, అన్నాడీఎంకే కార్యకర్తలు అధికంగా ఉన్న ప్రాంతాలకు తరలిస్తున్నారు.

  • Loading...

More Telugu News