: నాకు, అజిత్ కు మీ వెచ్చటి ప్రేమను, సూర్యోదయాన్ని పంపండి: వివేక్ ఒబెరాయ్


‘నాకు, అజిత్ కు, చిత్ర బృందానికి మీ వెచ్చటి ప్రేమను, భారత్ నుంచి సూర్యోదయాన్ని పంపండి’ అంటూ తన అభిమానులను బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కోరాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా చేసిన ఈ ట్వీట్ తో పాటు, చలి దుస్తులు ధరించిన ఒబెరాయ్ నవ్వుతున్న ఫొటోను పోస్ట్ చేశాడు. దక్షిణాది నటుడు అజిత్ తాజా చిత్రంలో ఒబెరాయ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. షూటింగ్ నిమిత్తం బల్గేరియాకు ఇటీవలే వెళ్లిన ఒబెరాయ్, మంచు దుప్పటి కప్పుకున్న ఆ నగరం గురించి ప్రస్తావించాడు. అక్కడ చలి బాగా ఉండటంతోనే తమ అభిమానుల నుంచి వెచ్చటి ప్రేమను, అందమైన భారత్ నుంచి సూర్యోదయాన్ని పంపమంటూ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News