: స్టేజ్ పైనే డ్యాన్సర్ ను కాల్చేశాడు!
స్టేజ్ పై డ్యాన్స్ చేస్తున్న డ్యాన్సర్ ను ఒక వ్యక్తి కాల్చేసిన దారుణ సంఘటన పంజాబ్ లోని భటిండాలో జరిగింది. స్టేజ్ పై డ్యాన్స్ చేస్తున్న 22 సంవత్సరాల యువతి తనతో కలిసి డ్యాన్స్ చేయలేదని ఆగ్రహించిన ఆ వ్యక్తి ఆమెను తుపాకీతో కాల్చేశాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో సదరు వ్యక్తి ఫుల్ గా మద్యం తాగి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ‘టైమ్స్ నౌ’ కథనం ప్రకారం, నిన్న రాత్రి ఒక పెళ్లి వేడుకల్లో భాగంగా భాటిండాలోని మ్యారేజ్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమెను కాల్చివేసిన వ్యక్తి ఆమెకు బంధువు కూడా అవుతాడని తెలుస్తున్నట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. మృతి చెందిన డ్యాన్సర్ గర్భవతి అని, ఈ సంఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని భాటిండా ఎస్పీ తెలిపారు.