: మహిళల బంగారాన్ని లాక్కోవాలని మోదీ, చంద్రబాబు చూస్తున్నారు: రఘువీరారెడ్డి
బంగారంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు. మహిళల బంగారాన్ని లాక్కోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు చూస్తున్నారని ఏపీ కాంగ్రెస్ పార్టీ నేత రఘువీరారెడ్డి విమర్శించారు. బంగారంపై పరిమితులు విధించడం సరికాదని, పెద్దనోట్ల రద్దుతో దేశంలో ప్రజలు రోడ్డున పడ్డారని ఆయన మండిపడ్డారు.