: ‘సెట్విన్’ బస్సులో మంటలు..ప్రయాణికులు సురక్షితం
సెట్విన్ బస్సులో మంటలు చెలరేగిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పాలమాకుల వద్ద ఈరోజు మధ్యాహ్నం జరిగింది. హైదరాబాద్ నుంచి జాగీర్ పీర్ల దర్గాకు వెళ్తుండగా పాలమాకుల వద్ద బస్సులో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపివేశాడు. డ్రైవర్ సూచన మేరకు ప్రయాణికులు దిగిపోయారు. స్థానికుల సాయంతో మంటలను అదుపు చేశారు.