: కన్న తల్లిని లైన్లో నిలబెట్టిన మోదీ, అంబానీని నిలబెట్టలేక పోయారు: రోజా నిప్పులు


బ్యాంకు ముందు కొత్త నోట్ల కోసం కన్న తల్లిని లైన్లో నిలబెట్టిన మోదీ, అంబానీని మాత్రం నిలబెట్టలేకపోయారని వైకాపా నేత రోజా విమర్శించారు. తన అమ్మను రోడ్డుపై నిలబెట్టిన ఆయనకు, బ్యాంకుల ఎదుట రోడ్లపై నిలబడి పేదలు పడుతున్న కష్టాల గురించి ఏం తెలుస్తుందని ఆమె ఎద్దేవా చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీలో నరేంద్ర మోదీ, ఏపీలో చంద్రబాబు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని, తనపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మోదీ పోగొట్టుకున్నారని విమర్శలు గుప్పించారు. నల్లధనాన్ని అరికట్టడంలో మోదీ పూర్తిగా విఫలం అయ్యారని, నోట్ల రద్దును ప్రకటించి నాలుగు వారాలు కావస్తున్నా, ఇప్పటికీ చాలినంత కరెన్సీ బ్యాంకులకు చేరలేదని, ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత మోదీదేనని అన్నారు.

  • Loading...

More Telugu News