: బాలకృష్ణ భార్య వద్ద పాత నోట్లు... ఎయిర్ పోర్టులో పట్టుకున్న ఐటీ అధికారులు
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర వద్ద రూ. 10 లక్షల విలువైన పాత కరెన్సీ లభ్యమైంది. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టిన వేళ, ఆమె వద్ద ఈ కరెన్సీని చూసిన పోలీసులు, అధికారులకు సమాచారం ఇచ్చారు. వసుంధర, బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఆరుగురు హైదరాబాద్ నుంచి స్పైస్ జెట్ విమానంలో రేణిగుంటకు వచ్చిన వేళ ఈ ఘటన జరిగింది. ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ జవాన్ల తనిఖీలో నగదు బయటపడగా, ఈ డబ్బుకు సంబంధించిన ఆదాయపు పన్ను ధ్రువీకరణ పత్రాలను వసుంధర చూపారు. ఆ పత్రాలు సరైనవేనని నిర్ధారించుకున్న అనంతరం వసుంధర బృందాన్ని అధికారులు విడిచిపెట్టారు.