: రిలయన్స్ జియో మరో విప్లవం.. ల్యాండ్ ఫోన్లలోనూ 4జీ.. 4 నెలలు ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ!
సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన రిలయన్స్ జియో మరో సంచలనంతో ముందుకొచ్చింది. 'వెల్‌కమ్ ఆఫర్'తో ప్రత్యర్థి టెలికం కంపెనీలకు వణుకు పుట్టించిన జియో 'న్యూ ఇయర్ ఆఫర్'తో దానిని మరో మూడు నెలలు పొడిగించింది. తాజాగా మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. 4జీ వీవోఎల్టీఈ సాంకేతికత కలిగిన ల్యాండ్‌ఫోన్లను కొత్తగా విడుదల చేసింది. ఇప్పటికే వాటిని తమ ఖాతాదారులకు పంపిణీ చేయడం ప్రారంభించింది. జియో సిమ్‌తో కాల్స్ నుంచి డేటా వరకు అన్నీ ఫ్రీ అన్న విషయం తెలిసిందే. కానీ ల్యాండ్‌ఫోన్లలో ఎలా? ఈ ల్యాండ్‌ఫోన్‌లో ఉండే వైర్‌లెస్ ఫోన్‌తో ఈ మొత్తం ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. హైదరాబాద్‌లోని అంకుర సంస్థ వైబ్రిడ్జ్ నెట్‌వర్క్ సొల్యూషన్స్ దీనిని అభివృద్ధి చేసింది. ఇందులో ఉండే హాట్‌స్పాట్ సాయంతో 8 పరికరాలను కనెక్ట్ చేసుకోవచ్చు. కొత్త ల్యాండ్‌లైన్ ఫోన్‌కు ఉండే యాంటెన్నా 4జీ సిగ్నళ్లను అందుకోవడమే కాకుండా వైఫై రోటర్‌గానూ పనిచేయడం విశేషం. స్మార్ట్‌ఫోన్‌లానే ఈ ఫోన్లోనూ సినిమాలు చూసుకోవచ్చు. ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. వీడియో కాన్ఫరెన్స్ చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే పేరుకే ల్యాండ్‌లైన్. మిగతావన్నీ సేమ్ టు సేమ్. మరో విశేషం ఏంటంటే, ఈ ఫోన్‌ను ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. జియో కనెక్షన్ ఉంటే నాలుగు నెలలపాటు ఉచిత సేవలు పొందవచ్చు. ఆన్‌లైన్‌లోనూ ఈ ఫోన్లు లభ్యమవుతున్నాయి.