: వంగవీటి, దేవినేని రెండు కుటుంబాలు సన్నిహిత కుటుంబాలు: కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్


వంగవీటి, దేవినేని కుటుంబాలు అత్యంత సన్నిహిత కుటుంబాలని కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, వంగవీటి సినిమాను సినిమాగా చూడాలని కోరారు. తనకు వంగవీటి, దేవినేని రెండు కుటుంబాలతో అనుబంధం ఉందని అన్నారు. ఈ సినిమాలో ప్రతిపాత్రతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. పెద్ద రాధా గారు తనను 'తమ్ముడూ' అని పిలిచేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ రెండు కుటుంబాల్లో చోటుచేసుకున్న చిన్నచిన్న మనస్పర్థలు హత్యల వరకు వెళ్లాయి తప్ప... ఈ ఘర్షణల్లో కులాల కోణం లేదని ఆయన తెలిపారు. అప్పట్లో చోటుచేసుకున్న సంఘటనలు రాజకీయ పార్టీకి మద్దతివ్వడం వల్ల జరిగిన ఘర్షణలే తప్ప విజయవాడలో కులాల కొట్లాటలు లేవని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News