: ఈ సినిమాకి పాటల రచయితన్నారు కానీ.. నేను మాటల రచయితను మాత్రమే!: చైతన్య కృష్ణ


'వంగవీటి' సినిమా గురించి మీడియాలో వచ్చేవేవీ నిజాలు కాదని ఈ సినిమా పాటల రచయిత చైతన్య కృష్ణ తెలిపారు. విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించిన 'వంగవీటి' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, నిజానికి తాను పాటల రచయితనని, కానీ ఈ సినిమాకు మాటలు రాశానని అన్నారు. వర్మ గుండెల్లో ఈ సినిమాకి ఉన్న ప్రాముఖ్యత తెలిసిన తరువాత తనకు పాటలు రాయడం చాలా కష్టం అనిపించిందని అన్నారు. దీంతో మాటలు రాశానని, వాటిని పాటలుగా వర్మ మలిచారని ఆయన చెప్పారు. ఈ సినిమా భావోద్వేగాల సంఘర్షణ అని ఆయన చెప్పారు. సినిమా చాలా బాగుంటుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News