: విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో ప్రారంభమైన 'వంగవీటి' ఆడియో వేడుక


ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన 'వంగవీటి' సినిమా ఆడియో వేడుక విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రారంభమైంది. ఈ ఆడియో వేడుకకు రాంగోపాల్ వర్మ అభిమానులతో పాటు, వంగవీటి అభిమానులు కూడా హాజరుకావడం విశేషం. దీంతో కేఎల్ యూనివర్సిటీలో సందడి నెలకొంది. వేడుకకు రాంగోపాల్ వర్మతోపాటు చిత్ర యూనిట్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఝాన్సీ వ్యవహరిస్తోంది. దీంతో కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణం కేరింతలతో నిండిపోయింది.

  • Loading...

More Telugu News