: 'మనీ హైతో హనీ హై...చిల్లర కావాలా?' అంటున్న లక్ష్మీ రాయ్


దేశవ్యాప్తంగా చిల్లర కష్టాలు ఏర్పడిన సంగతి విదితమే. అకౌంట్లలో డబ్బులున్నప్పటికీ బ్యాంకుల్లో మాత్రం క్యాష్ లేదు. బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేసినా వాటికి చిల్లర దొరక్క చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, సినీ నటి లక్ష్మీ రాయ్ వద్దకు చాలినంత చిల్లర వచ్చినట్టుంది. పంజాబ్ లోని అమృత్ సర్ లో స్నేహితులతో చక్కర్లు కొడుతున్న లక్ష్మీ రాయ్ చిల్లర డబ్బులు పది రూపాయల నోట్లతో దండలు వేసుకుని మరీ స్నేహితులతో ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతూ 'మనీ హైతో హనీ హై... చిల్లర కావాలా?' అంటూ వ్యాఖ్య జతచేసింది. ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News