: ప్రీతిజింటా సోదరుడి ఆత్మహత్య.. భార్యతో మనస్పర్థలే కారణమట!


'రాకుమారుడు' సినిమాలో మహేష్ బాబు సరసన నటించి టాలీవుడ్ కు పరిచయమైన ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా సోదరుడు (కజిన్ బ్రదర్) నితిన్ చౌహాన్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. భార్యతో మనస్పర్థల నేపథ్యంలో డిప్రెషన్ లో ఉన్న నితిన్ చౌహాన్ శుక్రవారం ఉదయం కారులో తలుపులు వేసుకుని తలపై తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి ఎంతసేపైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కారులో తుపాకీతో కాల్చుకుని పడిపోయిన నితిన్ చౌహాన్ ను గుర్తించారు. కారులో నాలుగు పేజీల సూసైడ్ నోట్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో అత్తమామల వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఆయన తెలిపారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News