: తమ పార్టీ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ చేసిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ తమ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ చేసింది. ఈ నెల 5వ తేదీన ప్రతి ఒక్కరూ రాజ్యసభకు హాజరుకావాలని ఆదేశించింది. సోమవారం నాడు కీలకమైన బిల్లులపై ఓటింగ్ జరిగే అవకాశం ఉండటంతో విప్ జారీ చేసింది. పలు బిల్లులను ఆమోదించుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుండటంతో... అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై ఇప్పటికే విపక్షాలన్నీ ఏకమైన సంగతి తెలిసిందే. నోట్ల రద్దు అంశంపై పార్లమెంటులోని ఉభయసభలు దద్దరిల్లుతున్నాయి.