: జగన్‌కు మూడు భయాలు పట్టుకున్నాయి: మంత్రి పల్లె
అనంతపురం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఈ రోజు నిర్వహించిన ప్రతిభావంతుల దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషిచేస్తోందని చెప్పారు. తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోన్న ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు మూడు భయాలు పట్టుకున్నాయని, అవి ఈడీ, జేడీ, మోదీ అని ఆయన వ్యాఖ్యానించారు. నల్లధనం సంపాదించుకున్న వారు ఎప్పటికైనా పట్టుబడాల్సిందేనని అన్నారు.