: సందడే సందడి.. యువీ, హజల్‌ కీచ్‌ల సంగీత్ వేడుకలో డ్యాన్స్ చేసిన విరాట్, అనుష్కల జంట


టీమిండియా క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌, బాలీవుడ్‌ నటి హజల్‌ కీచ్‌ల పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం నిన్న నిరాడంబరంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుక‌కి విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌లు కూడా హాజ‌ర‌య్యారు. యువరాజ్ దంపతులకు ఈ జంట‌ అభినందనలు చెప్పింది. అంత‌కు ముందు చండీగఢ్‌లో జరిగిన సంగీత్‌లో కూడా కోహ్లీ, అనుష్క‌ల జంట డాన్సు కూడా చేసింది. అనంత‌రం గోవాలో వివాహ‌వేడుక‌కు హాజ‌ర‌య్యారు. నీలి రంగు షేర్వాణీ వేసుకున్న కోహ్లీతో పాటు నలుపు, బంగారు వర్ణాలలోని ఎథ్నిక్ డ్రస్ ధ‌రించిన అనుష్కను చూడ‌డానికి పెళ్లి వేడుక‌కు వ‌చ్చిన వారికి రెండు క‌ళ్లు స‌రిపోలేదు. కోహ్లీ, అనుష్క‌ల జంట విమానాశ్ర‌యంలో ప్రముఖ బాలీవుడ్ గీత రచయిత జావేద్ అఖ్తర్‌ను కలిసి, ఆయనతో ఫొటోలు కూడా తీయించుకుని ఎంజాయ్ చేశారు. చంఢీగఢ్ నుంచి గోవా వెళ్లేవ‌ర‌కు ఈ జంట ఆనందంగా గ‌డిపారు.

  • Loading...

More Telugu News