: 2 లక్షల రూపాయలకు పొత్తిళ్లలో బిడ్డను అమ్మేసిన తల్లి!
తల్లి అనే పదానికి కళంకం తెచ్చిందో మహిళ. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పొత్తిళ్లలో బిడ్డను కన్నతల్లే విక్రయించిన ఘటన విశాఖపట్టణం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... విశాఖ జిల్లా సబ్బవరం మండలంలోని వెదుళ్లనరవ బీసీ కాలనీకి చెందిన రమణమ్మ 26 రోజుల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం పొత్తిళ్లలోని బిడ్డను రమణమ్మ 2 లక్షల రూపాయలకు విక్రయించింది. ఇది అక్కడ కలకలం రేపింది. దీంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా చేరి, ఐసీడీఎస్ అధికారుల వరకు చేరడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రమణమ్మపై కేసు నమోదు చేసిన పోలీసులు, బిడ్డను వెనక్కి తీసుకురావాలని సూచించారు. ఈ బాధ్యతను రమణమ్మ అక్క, బావకు అప్పగించారు.