: మమతా బెనర్జీ లేవనెత్తిన అంశాలు సరైనవే: యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్
పెద్దనోట్ల రద్దుపై ఆందోళన తెలుపుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమర్థించారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో దేశ వ్యాప్తంగా ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కుంటున్నారని అన్నారు. ఈ అంశంలో ఇటీవల కేంద్ర సర్కారుని నిలదీస్తూ మమతా బెనర్జీ లేవనెత్తిన అంశాలు సరైనవేనని ఆయన అన్నారు. ఢిల్లీని అభివృద్ధి పథంలో నడిపించడంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎంతో కృషి చేస్తున్నారని కూడా అఖిలేష్ వ్యాఖ్యానించారు.