: మార్చి నెలలో వెంకన్న సేవలకు సంబంధించిన 53,348 టికెట్లు విడుదల.. అరగంటలో ప్రధాన సేవా టికెట్లు హాంఫట్!
తిరుమల శ్రీవెంకటేశ్వరుని మార్చి నెల సేవా టికెట్లు ఆన్ లైన్లో అందుబాటులోకి వచ్చాయి. వివిధ రకాల సేవలకు సంబంధించిన మొత్తం 53,348 టికెట్లను అందుబాటులో ఉంచినట్టు టీటీడీ పేర్కొంది. సుప్రభాతం 6,498, అర్చన 130, తోమాల సేవ 130, విశేషపూజ 1500, అష్టదళపాదపద్మారాధన 60, నిజపాద దర్శనం 1,875, కల్యాణోత్సవం 11,250, వసంతోత్సవం 10,750, బ్రహ్మోత్సవం 5,805, సహస్ర దీపాలంకార సేవ 12,350, ఊంజల్ సేవ 3 వేల టికెట్లు విడుదలయ్యాయి. కాగా, టికెట్ల బుకింగ్ 11 గంటలకు ప్రారంభమవగా, అరగంట కూడా గడవకుండానే, అర్చన, సుప్రభాతం, తోమాలసేవ, నిజపాద దర్శనం వంటి సేవలకు టికెట్లు అయిపోయాయి.