: ‘ఇప్పటికే పలువురిపై చర్యలు తీసుకున్నాం’.. నల్లకుబేరులకు మరోసారి వార్నింగ్ ఇచ్చిన ఆర్థికశాఖ
పెద్దనోట్ల రద్దు తరువాత భారీ ఎత్తున జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ నల్లకుబేరులకు మరోసారి వార్నింగ్ ఇచ్చింది. మనీ లాండరింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఆ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ ఈ రోజు మరోసారి హెచ్చరించారు. అక్రమ లావాదేవీలపై నిఘా ఉంచామని ఇప్పటికే పలువురిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఆదాయ పన్ను శాఖ జరుపుతున్న దాడుల్లో పెద్దఎత్తున డబ్బును స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఆ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, భవిష్యత్తులోనూ నల్లకుబేరులు ఇటువంటి చర్యలకు పాల్పడితే కష్టాలు ఎదుర్కోక తప్పదని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Trails being pursued by agencies. Coordinated action underway. Result already visible. Will be more visible in coming days.
— Shaktikanta Das (@DasShaktikanta) 2 December 2016