: నూతన కొనుగోళ్లు కరవు... రూ. 28 వేల దిగువకు బంగారం ధర
తాము ప్రజల వద్ద ఉన్న బంగారంపై పన్నులు వసూలు చేయాలని భావించడం లేదని కేంద్రం ఎంతగా ప్రజలకు నచ్చజెప్పినా, భయాందోళనలు వీడకపోవడంతో వరుసగా మూడవ రోజూ బులియన్ మార్కెట్ కుదేలైంది. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 465 పడిపోయి, 1.64 శాతం నష్టంతో రూ. 27,920 (డిసెంబర్ 5 డెలివరీ)కు చేరింది. బంగారం ధర రూ. 28 వేల కన్నా కిందకు రావడం ఏప్రిల్ తరువాత ఇదే మొదటిసారి. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 371 తగ్గి 0.93 శాతం నష్టంతో రూ. 39,718 వద్ద కొనసాగుతోంది.