: కారైకల్ వద్ద తీరం దాటిన నాడా తుపాను.. కోసాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు
తమిళనాడును వణికించి, కోస్తాంధ్రను భయభ్రాంతులకు గురిచేసిన నాడా తుపాను కారైకల్ వద్ద తీరం దాటింది. దీంతో తమిళ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తుపాను కారణంగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను కారణంగా కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.