: ఆదాయపుపన్ను ప్రిన్సిపల్ కమిషనర్ బొడ్డు వెంకటేశ్వరరావు ఇంటిపై సీబీఐ దాడులు


ఇన్ కమ్ ట్యాక్స్ శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ బొడ్డు వెంకటేశ్వరరావు నివాసంపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లో అవినీతికి పాల్పడిన బొడ్డు వెంకటేశ్వరరావుపై గత ఆరు నెలలుగా నిఘా పెట్టిన సీబీఐ అధికారులు నేటి మధ్యాహ్నం హైదరాబాదు, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులోని ఆయన నివాసంపై దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆయన నివాసం నుంచి 5 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు వివిధ ప్రాంతాల్లో పలు అపార్ట్ మెంట్లు ఉన్నట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. కూకట్ పల్లి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీల్లో ఆయనకు ఇళ్లు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఇవన్నీ ఎలా వచ్చాయన్న దానిపై వారు ఆరాతీస్తున్నారు.

  • Loading...

More Telugu News