: గడ్డపార దిగి గ్యాస్ పైప్ లైన్ లీక్


రోడ్డు పక్కన ఉన్న తుప్పలను కొడుతుండగా, గడ్డపార పొరపాటున గ్యాస్ పైప్ లైన్ లోకి దిగబడి, గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం సూర్యారావుపేట లైట్ హౌస్ వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పైప్ లైన్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో, భాగ్యనగర్ పైప్ లైన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, వెంటనే మరమ్మతులు చేశారు. ఆ తర్వాత స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News