: రేవంత్ రెడ్డికి చిప్పకూడు తప్పదు: పల్లా రాజేశ్వర్ రెడ్డి
టీటీడీపీ నేత రేవంత్ రెడ్డికి చిప్పకూడు తప్పదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. తెలంగాణలో పేదలకు మెరుగైన విద్య, వైద్యం సదుపాయాలు అందిస్తూ; పాఠశాల, కళాశాలల హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో ఆహారం అందిస్తున్నది కేసీఆర్ కాదా? అని ఆయన ప్రశ్నించారు.