: ఫేస్‌బుక్‌, వాట్సప్‌ కంటే వేగంగా జియో అభివృద్ధి: ముఖేష్ అంబానీ


రిల‌య‌న్స్ జియో త‌క్కువ స‌మ‌యంలోనే అత్య‌ధిక మంది వినియోగ‌దారుల‌ను సొంతం చేసుకుంద‌ని రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ అన్నారు. ఇది తమ ఖాతాదారుల విజయంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. తాము తీసుకొచ్చిన జియో సిమ్‌ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామని వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాలయిన ఫేస్‌బుక్‌, వాట్సప్‌ల‌ కంటే అధికమంది ఖాతాదారులను సొంతం చేసుకుంటూ వేగంగా జియో అభివృద్ధి చెందుతోందని ఆయ‌న తెలిపారు. జియో అత్యంత వేగంగా సాంకేతికతను అందిస్తోంద‌ని, గ‌త‌ మూడు నెలలుగా రోజుకు 6 లక్షల మంది చొప్పున జియో సిమ్ తీసుకున్నార‌ని పేర్కొన్నారు. కాగిత రహిత సమాజం కోసమే తాము జియో సేవ‌లను తీసుకొచ్చామ‌ని ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు. జియో ఇతర నెట్‌వర్క్‌ కంటే జియో 25రెట్లు వేగంగా పనిచేస్తూ అత్య‌ధిక మంది క‌స్ట‌మ‌ర్ల‌ను సొంతం చేసుకుంద‌ని చెప్పారు. వినియోగ‌దారుల నుంచి సూచనలు తీసుకునేందుకు తాము లాంచింగ్‌ ఆఫ్‌ ఇచ్చామని అన్నారు. జియో సిమ్‌ను ఈ-కేవైసీ ద్వారా క‌స్ట‌మ‌ర్లు సిమ్ తీసుకున్న ఐదు నిమిషాల్లోనే దాన్ని యాక్టివేట్ చేస్తున్న‌ట్లు తెలిపారు. త‌మ‌కు ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా తాము అందిస్తోన్న‌ ఉచిత కాల్స్‌ సదుపాయాన్ని అందిస్తూనే ఉంటామ‌ని, అత్యుత్తమ సేవలను అందిస్తామ‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News