: దేశ ఆర్థిక దిశ మారుతుంది.. ఎంతో ధైర్యంతో మోదీ నిర్ణయం తీసుకున్నారు: ముఖేష్ అంబానీ
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని తాను అభినందిస్తున్నానని రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. ఈ రోజు ముంబయిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దేశ ఆర్థిక దిశను మార్చే విధంగా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని కొనియాడారు. దేశ వ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెరుగుతాయని అన్నారు. దీనివల్ల దేశంలో నగదు లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుందని అన్నారు. ఎంతో ధైర్యంతో ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. డిజిటల్ లావాదేవీలు పెరిగి, అందరిలో అవగాహన కలిగితే ఇక ముందు ప్రయాణ టికెట్లు కొనడానికి క్యూల్లో నిలబడే అవసరం ఉండదని అన్నారు. డిజిటల్ ఎకానమీ ద్వారా దేశం మరింత వృద్ధిలోకి వెళుతుందని చెప్పారు.