: శ్రీకాళహస్తి ఆలయంలో బాయిలర్ పేలుడు.. తప్పిన పెనుప్రమాదం
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలోని అన్నదాన మండపంలో బాయిలర్ పేలుడు సంభవించింది. అక్కడ వంట కోసం 40 సిలిండర్లు కూడా ఉండడంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. బాయిలర్ పేలుడుతో వెంటనే అక్కడి సిబ్బంది అంతా పరుగులు తీశారు. ఈ ఘటనలో మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.