: అనుకోని షాకిచ్చిన కేంద్రం... రేపటి నుంచి పెట్రోలు బంకుల్లో రద్దయిన పాత నోట్లు తీసుకోరు!


ఇంకా మిగిలివున్న పాత నోట్ల మార్పిడికి ఉన్న అతి కొద్ది అవకాశాల్లో ఒకటైన పెట్రోలు బంకుల్లో వినియోగ అవకాశం రేపటితో ముగియనుంది. తొలుత ఈ నెల 15 వరకూ రద్దయిన నోట్లతో పెట్రోలు కొట్టించుకునే అవకాశాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, ఎవరూ ఊహించని విధంగా ఈ ఉదయం కీలక ప్రకటన వెలువరించింది. పాత రూ. 500 నోట్లతో పెట్రోలు కొనుగోలు చేసేందుకు తుది గడువు రేపటితో ముగియనున్నట్టు ప్రకటించి షాకిచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ కొద్దిసేపటి క్రితం సర్క్యులర్ జారీ చేసింది. 3వ తేదీ నుంచి ఏ పెట్రోలు బంకులోనూ రద్దయిన పాత నోట్లు స్వీకరించబోరని, ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని తెలిపింది. కాగా, ఇప్పటికే రూ. 1000 నోట్లను పెట్రోలు బంకుల్లో తీసుకోవడం లేదన్న సంగతి తెలిసిందే. ఇక రూ. 1000, రూ. 500 కాగితాలు ఎవరి వద్దనైనా ఉంటే వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయక తప్పనిసరి పరిస్థితి. కాగా, రూ. 500 కాగితాలతో కరెంటు బిల్స్ వంటివి మాత్రం చెల్లించే అవకాశం మరో రెండు వారాలు కొనసాగనుంది.

  • Loading...

More Telugu News