: తమిళనాడులో ఘోర అగ్నిప్రమాదం... 10 మంది మృతి
తమిళనాడులో ఈ రోజు ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. తిరుచ్చి జిల్లా తురైయూర్ లోని ఓ బాణసంచా కర్మాగారంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో పదిమంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సదరు కర్మాగారంలో మంటలు వ్యాపించిన సమయంలో మొత్తం 20 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదస్థలికి చేరుకున్న ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ అగ్నిప్రమాదంపై ఆరా తీస్తున్నారు.