: వ్యాపారాలు వదిలేస్తానంటూ సంచలన ప్రకటన చేసిన ట్రంప్
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 45వ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తాను వ్యాపారానికి గుడ్ బై చెబుతున్నానని తెలిపారు. వ్యాపారాలను వారసులకు అప్పగించి అమెరికా అభివృద్ధికే తన సమయాన్నంతా కేటాయించబోతున్నానని అన్నారు. ప్రపంచ దేశాల్లో అమెరికాను మరోసారి గ్రేట్ గా చేయడమే తన లక్ష్యమని తెలిపారు. వ్యక్తిగత వ్యాపారాలను వదలని ట్రంప్ అమెరికాను ఎలా అభివృద్ధి పథంలో నిలబెడతారని ఆయన ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తన వ్యాపారాలను పిల్లలకు అప్పగించేందుకు లీగల్ డాకుమెంట్లు సిద్ధం చేస్తున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు డిసెంబర్ 15న అధికారిక ప్రకటన చేస్తానని ఆయన ప్రకటించారు.