: యువీ పెళ్లి ఫొటోలు వచ్చేశాయ్!
టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి హజెల్ కీచ్ ల వివాహం వైభవంగా జరిగింది. సిక్కు సాంప్రదాయం ప్రకారం చండీగఢ్ గురుద్వారలో ఈరోజు వారి వివాహం జరిగింది. ఈ వివాహానికి పలువురు క్రికెటర్లు, సినీ ప్రముఖులు హాజరై కొత్తజంటను ఆశీర్వదించారు. పెళ్లి కొడుకు యువీ, పెళ్లికూతురు హజెల్ పెళ్లి దుస్తుల్తో మెరిసిపోయారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ గా మారాయి. కాగా, పెళ్లి వేడుకల్లో భాగంగా నిన్న నిర్వహించిన ‘సంగీత్’ లో యువీ స్టెప్పులతో అదరగొట్టాడు.