: 2017 నవంబర్ నాటికి మియాపూర్-ఎల్బీనగర్ మెట్రో పనులు పూర్తి చేయండి: కేసీఆర్
హైదరాబాద్ లో మెట్రో రైలు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఈ రోజు ప్రగతి భవన్ లో మెట్రో పనులపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మెట్రో ఛైర్మన్ సుబ్రహ్మణ్యం, ప్రాజెక్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్ రావులు హాజరయ్యారు. ఈ సందర్భగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. మెట్రో పనులు పూర్తైతే నగరంలోని ట్రాఫిక్ కష్టాలు కొంత మేర తగ్గుతాయని తెలిపారు. 2017 నవంబర్ నాటికి మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు ఉన్న లైన్ పనులను పూర్తి చేయాలని కోరారు. మిగిలిన పనులన్నింటినీ 2018 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని చెప్పారు.